Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఫొటోను పోస్టు చేసేందుకు గౌరీ ఖాన్ అనుమతిచ్చిందోచ్!: షారూక్ ఖాన్

  • యూరప్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న షారూక్ కుటుంబం
  • సోషల్ మీడియాకు గౌరీ ఖాన్ దూరం
  • తొలిసారి ఫొటో పోస్టుకు అనుమతి
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ తన భార్య గౌరీఖాన్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇందులో ఎటువంటి విశేషం లేకపోయినా, ఆ ఫొటో కింద షారూక్ రాసిన వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు కొన్నేళ్ల తర్వాత గౌరీ ఖాన్ తనకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నాడు. అంతేకాదు, అది ఆమె మంచితనం అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం షారూక్, భార్య గౌరీ, పిల్లలు అభ్‌రామ్, సుహానా, ఆర్యన్‌లు యూరప్‌లో విహార యాత్రలో ఉన్నారు.

నిజానికి గౌరీ ఖాన్‌ ప్రైవసీ కోరుకుంటారు. అందుకే ఆమె గురించి పెద్దగా వార్తలు రావు. అయితే, చాలా ఏళ్ల తర్వాత షారూక్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు అనుమతించారు. ఈ ఫొటోలో వారిద్దరూ హాలీడే మూడ్‌లో ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. గౌరీకి ఇంటర్నెట్‌కు దూరంగా ఉండడం అలవాటు కాగా, వారి పిల్లలు మాత్రం ఇంటర్నెట్‌లో దూకుడుగా ఉంటారు. ఇటీవల వారి ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
Gauri Khan
Shah Rukh
Bollywood
photo

More Telugu News